హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు ఫేజ్ - 3 మెయిన్ పైప్లైన్లో భారీ లీకేజీని అరికట్టడానికి అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. దీనితో పాటు, టిఎస్ ట్రాన్స్కో ఆధ్వర్యంలో సాధారణ నిర్వహణ పనులు నిర్వహించనున్నారు.ఈ పనులు ఈరోజు రాత్రి 8 గంటల వరకు జరుగుతాయి. కావున ఈ 12 గంటలు కింద పేర్కొన్న రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. మరమ్మతు పనులు పూర్తి చేసిన అనంతరం నీటి సరఫరా తిరిగి పునరుద్ధరిస్తారు.కావున కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:1. డివిజన్–6: బంజారాహిల్స్, సోమాజిగూడ, వెంకటగిరి, యల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ, ఎస్పీఆర్ హిల్స్ తదితర ప్రాంతాలు.
2. డివిజన్–9: కేపీహెచ్బీ, బోరబండ, గాయత్రి నగర్, మూసాపేట్, భారత నగర్.
3. డివిజన్–15: కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్.
4. డివిజన్–17: గోపాల్ నగర్.5. డివిజన్–22: తెల్లాపూర్.కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa