ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 07:47 PM

హైదరాబాద్‌లోని హయత్‌నగర్ కుంట్లూరు సమీపంలోని బీబీఆర్ గ్రౌండ్స్‌లో క్రికెట్ ఆడుతున్న ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, మైదానంలో ఆటగాళ్లు ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా  యువకుడికి ఛాతీలో నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa