ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడపగడపకూ బాకీ కార్డులు అందజేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 03, 2026, 12:30 PM

సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డిలు సిద్దిపేట పట్టణంలోని 7వ వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిపడిన పథకాలపై 'బాకీ కార్డు'లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మంజుల రాజనర్సు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలకు బాకీపడ్డ నిధులను ఇచ్చాకే ఓట్లు అడగాలని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీల్లోనూ బకాయిపడిందని ఆమె వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa