ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగట్టులో అండర్‌పాస్ బ్రిడ్జి కోసం గ్రామస్తుల ధర్నా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 03:28 PM

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామ ప్రజలు, సర్పంచ్, పాలకవర్గ సభ్యులు కలిసి జాతీయ రహదారి పక్కన టెంట్ వేసి ధర్నా చేపట్టారు. గ్రామం లెవెల్‌లో ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రోడ్డు నిర్మాణం వల్ల మురికినీరు నిల్వ ఉండి దోమల బెడద పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అండర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతూ జాతీయ రహదారి అధికారులను గ్రామస్తులు నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa