హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2 లోని కలాబ్ గూర్, పటాన్‌చెరులో 25 సంవత్సరాలకు పైగా పాతబడిన హెచ్‌టి (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించి, వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.అదే సమయంలో, అమీన్‌పూర్ ఎక్స్‌రోడ్ నుండి మాదీనగూడ వరకు పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీలను అరికట్టి, అవసరమైన చోట్ల ఎంఎస్ బ్యారెల్స్‌ను మార్పిడి చేస్తూ మరమ్మతు పనులు చేపడుతున్నారు.ఈ పనులను తేది.11.02.2026, బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేది.12.02.2026, గురువారం రాత్రి 10 గంటల వరకు చేపట్టనున్నారు. కావున ఈ 40 గంటలు కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో లో ప్రెజర్ తో నీటిసరఫరా, మరికొన్ని ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలుగుతుంది.అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎం డివిజన్ 17: ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్.
2. ఓ అండ్ ఎం డివిజన్ 22: బీరంగూడ, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ.
3. ట్రాన్స్ మిషన్ డివిజన్ 2: ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు.
4. ఓ అండ్ ఎం డివిజన్ 6: ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్.
5. ఓ అండ్ ఎం డివిజన్ 9: కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్
కాబట్టి.. పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa