ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 01:53 PM

 కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన శంషాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ముచ్చింతల్ గ్రామానికి చెందిన ఎం.డి. సుల్తానా కుమార్తె సనా (16) బుధవారం రాత్రి భోజనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించింది. అర్ధరాత్రి సమయంలో ఆమె కడుపు నొప్పితో బాధపడటంతో కుటుంబసభ్యులు శంషాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి సనా మృతిచెందినట్లు నిర్ధారించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa