ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ ఎన్నికల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 03:03 PM

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో నిన్న పోలింగ్ ముగిసింది. చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఎన్నికల సమయంలో చాలామంది అభ్యర్థులు అనధికారికంగా ఓటర్లకు నగదు, ఇతర బహుమతులు పంచుతుంటారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో ఒక అభ్యర్థి ఇచ్చిన కానుక చర్చనీయాంశంగా మారింది. తమకు గోల్డ్ కాయిన్ అని చెప్పి నకిలీ కానుక ఇచ్చారంటూ సిరిసిల్లలో ఓ వార్డులో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు అభ్యర్థి ఓట్లు వేయించుకోవడానికి రాగి నాణేలకు పసిడి పూత పూసి వాటిని బంగారు నాణేలుగా ఇచ్చారని పలువురు వాపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa