మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్లాపూర్ లో #TechnipFMC వారి సహకారంతో నిర్మిస్తున్న "మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల" భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ఈటల రాజేందర్ మాట్లాడుతూ .....టెక్నిప్FMC కంపెనీ నిధులతో( 1.8 కోట్లు) ఈ స్కూల్ అభివృద్ది చేయడం సంతోషం. CSR నిధులు మౌలికవసతులకు ఖర్చు చేయాలని కేంద్రం నిబంధనలు తీసుకురావడం వల్ల దేశంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజుల్లో విద్య చాలా ఖరీదు అయ్యింది. విద్యను కొనుక్కోవాల్సి వస్తుందా అని నేను విద్యార్థిగా ఉన్నప్పుడు భావించేవాళ్లం. క్యాపిటేషన్ ఫీ పెడితేనే దానికి వ్యతిరేకంగా కొట్లాడినం. కానీ ఇప్పుడు విద్య అంటేనే ప్రైవేట్ స్కూల్స్.. ప్రభత్వ స్కూల్స్ ఉన్నాయి అక్కడ కూడా మంచి విద్య అందిస్తారనే భావన లేకుండా పోయింది. కానీ ప్రభత్వ స్కూల్స్ లో క్వాలిటీ టీచర్లు ఉంటారని మర్చిపోవద్దు. నిజమైన అవసరం ఉన్నవారికి విద్య అందిస్తుంది ప్రభత్వ పాఠశాలలే. ఇక్కడ చదువుకున్న వారు గుర్తుపెట్టుకుంటారు.
నా 25 ఏళ్ల రాజకీయాలలో.. సమస్యల పరిష్కారం కోసం అధికారుల దగ్గిరికి వెళితే.. కాన్వెంట్ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వారు ఐఏఎస్ అయితే రూల్స్ చెప్తూ ఉండేవారు. ప్రజల దుఃఖం బాధ తెలియని వారు మానవతాకోణం జోడించరు.
అదే పేదరికం నుండి వచ్చిన వారు అవన్నీ మాట్లాడరు.. పని చేసి పెడతారు. ఫ్లాట్ మీద చాయ్ అమ్ముకున్న బిడ్డ దేశ ప్రధాని కాగలిగిన గొప్ప ప్రజాస్వామిక దేశం భారత దేశం. అయన ప్రధాని అయ్యాక 12 ఏళ్లలో ఒక్కనాడు కూడా భారతజాతి తల దించుకోకుండా గల్లా ఎగురవేసేల పాలన చేస్తున్నారు. ఒకప్పుడు ఇతరదేశాల మీద ఆధారపడ్డ భారత్ ఇప్పుడు స్వయంప్రతిపత్తి సాధించింది.
ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ గురుంచి ఆలోచన చేస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతున్నాం. ఇది మోడీ గారివల్లనే సాధ్యం అయ్యింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో అన్నం తిన్నప్పుడు అనుభవించిన బాధ గుర్తుంది కాబట్టే నేను ఆర్థిక మంత్రి అయ్యాక.. ఎంత తింటే అంత సన్నబియ్యం అన్నం పెట్టమని జీఓ ఇచ్చాను. అందుకే రాజకీయలోకి కూడా బాధలు అనుభవించిన వారు రావాలి. అప్పుడే ప్రజల బాధలు తీరుస్తారు. ఎన్నికల్లో డబ్బులు పంచే విష సంస్కృతి పెరిగింది, ఇది విరగాలి. పేదరికం శాపం కాకూడదు, మట్టిలో మాణిక్యంలా ఎదగాలి. సమాజంను మార్చే శక్తిగా ఎదగాలి. ఈసందర్భగా అంగన్ వాడీ టీచర్లు ఎంపీ ఈటలను కలసి వారి సమస్యలపై వినతి పత్రం అందించారు. ఇదే స్కూల్లో చదువుకున్న రాజిరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే కూడా అయ్యాడు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, ప్రభుదాసు, టెక్నిప్FMC కంపెనీ ఎండీ అర్జున్, డైరెక్టర్ విక్రమ్, ప్రాజెక్ట్ ఇంచార్జ్ సుజాత, స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీలత, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa