ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాధితునికి ఎల్వోసి అందజేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 03:02 PM

షాద్ నగర్ నియోజకవర్గంలో కేశంపేట మండల కేంద్రానికి చెందిన దొబ్బల రాములు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలియగానే, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తక్షణమే స్పందించారు. నిమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బందితో చర్చించి, ప్రత్యేక చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం నుండి రూ. 2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని వైద్య ఖర్చుల కోసం మంజూరు చేయించారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సమక్షంలో బాధితునికి ఎల్వోసీ అందజేశారు. ఈ సహాయం పట్ల బాధితుని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa