ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్ లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 03:12 PM

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య రేగిన భీకర పోరు ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుండటంతో గల్ఫ్ దేశాలన్నీ యుద్ధ క్షేత్రాలుగా మారాయి. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో వారిని పరామర్శించేందుకు ఐదు రోజుల క్రితమే ఆయన దుబాయ్ వెళ్లారు. విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబంతో కలిసి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగానే ఉన్నప్పటికీ, విమానాశ్రయ అధికారులు క్లియరెన్స్ ఇచ్చే వరకు స్వదేశానికి తిరిగి రావడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తుమ్మల స్పందిస్తూ... తాను సురక్షితంగానే ఉన్నానని తెలిపారు. విమాన సర్వీసులు ప్రారంభమైన వెంటనే హైదరాబాద్ కు బయల్దేరుతానని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa