ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగర్‌కర్నూల్ లో సందడి చేస్తున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న దంపతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 03:13 PM

టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల రాకతో నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మెన్ పేట గ్రామం పులకించిపోతోంది. విజయ్ స్వగ్రామంలో ఈ నూతన దంపతులు డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా తులసిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెళ్లి తర్వాతి ఆచారాల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వీరు సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో ఆసీనులయ్యారు. ఈ వేడుకను కళ్లారా చూసేందుకు అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలతో పాటు గ్రామానికి చెందిన సుమారు 400 మంది అతిథులు హాజరయ్యారు. విజయ్-రష్మికల రాకతో తుమ్మెన్ పేటలో పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటులను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.అయితే, ఈ స్టార్ కపుల్ భద్రత దృష్ట్యా వారి నివాసం వద్ద కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కేవలం ముందస్తు పాసులు ఉన్న వారిని మాత్రమే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతిస్తున్నారు. అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్ నేతృత్వంలో సీఐ నాగరాజు, బల్మూరు ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa