ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కులగణనలో బీసీలను చేర్చాలి: బీసీ జేఏసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 08:30 PM

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ మాట్లాడుతూ, 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జరగనున్న కులగణనలో బీసీలను తప్పనిసరిగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలను లెక్కించకుండా కులగణన నిర్వహిస్తే దానిని బహిష్కరిస్తామని హెచ్చరించారు. 1931 తర్వాత బీసీల దీర్ఘకాల పోరాట ఫలితంగా గత సంవత్సరం ఏప్రిల్ 30న జనగణనతో పాటు కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa