ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 08:36 PM

పటాన్చెరు :ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పవిత్ర మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం బీరంగూడ డివిజన్ పరిధిలోని ఇసుక బావి కాలనీలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యునూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, నగేష్ యాదవ్, మాజీ ప్రజా ప్రతినిధులు, మైనారిటీ మత పెద్దలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa