కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా ముఖ్యమైన పోస్టులన్నీ భర్తీ చేయాలని షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ మేరకు పదిరోజుల శిక్షణ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు తేదీలను ఖరారు చేసి పేర్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 15లోగా డీసీసీ కార్యవర్గం, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం, 16-25లోగా మండల, బ్లాక్ కాంగ్రెస్ కార్యవర్గం ఖరారు, ఏప్రిల్ 1-30లోగా బూత్ లెవల్, గ్రామ పంచాయతీ స్థాయిలో అధ్యక్షులు, కార్యవర్గాల నియామకం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa