ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్జ్ లో మౌలిక వసతుల కల్పనకు కసరత్తు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 11:53 AM

నిమ్జ్ లో మౌలిక వసతులు కల్పించే ఎస్ఆర్అర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి  ఇప్పటివరకు సేకరించిన  భూములను అప్పగించాలని కలెక్టర్ సూచించారు. లే అవుట్ అభివృద్ధి చేసేందుకు వీలుగా పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. లే అవుట్ ప్రకారం రోడ్లు, ఇతరత్ర మౌలిక వసతులు కల్పించేందుకు సేకరించిన భూముల్లో  హద్దురాళ్ళను ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. గతంలోనే భూములు తీసుకుని రైతులకు నష్ట పరిహారం చెల్లించామని కానీ మొన్నటివరకు ఆ భూముల్లో పనులు చేపట్టకపోవడంతో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఇచ్చామని కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు చేపట్టనుండటం తో ఇకపై పంటలు వేయకుండా చూడాలని, ఐదివరకే పంటలు వేసి ఉంటే కోతలు పూర్తయ్యే వరకు వేచి చూడాలన్నారు.  సర్వే  ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతియుత వాతావరణం లో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సర్వే సందర్భంగా వేసిన హద్దు రాళ్ళను రైతులేవరూ తొలగించవద్దని, అలా చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టర్ లు మాధురి,  పాండు లతో పాటు  టీజిఐఐసి జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి, తహసీల్దార్ లు పాల్గొన్నారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa