తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెలలోనే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, రానున్న 5 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నెల 7వ తేదీ నుండి రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa