గురువారం ఉదయం జరిగే వివాహ వేడుకకు రావాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక ఆహ్వానం పలికారు. రేపటి వివాహ వేడుక పనులను అధికారులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి వీఐపీ పార్కింగ్, సాదారణ పబ్లిక్ వచ్చే ఏరియాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. దేశ వ్యాప్తంగా వచ్చే ముఖ్య అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హోటల్స్, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa