ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకు ఉచితంగా 30 రకాల వైద్య పరీక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 03:27 PM

రాష్ట్రంలోని మహిళలకు కాంగ్రెస్ సర్కాస్ గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళలు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 'హెల్త్ మిషన్-100' (100 రోజుల ఆరోగ్య మిషన్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం మొదలవుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద మహిళలకు ఎలాంటి ఖర్చు లేకుండా అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలను అందించడం దీని లక్ష్యం. ఈ వైద్య పరీక్షలు వచ్చే 6 నెలల పాటు కొనసాగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa