ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇఫ్తార్ విందులలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 12:33 PM

రామచంద్రాపురం : గంగా జమున తేహజీబ్ సంస్కృతికి ప్రతీక పటాన్చెరు నియోజకవర్గమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్ మసీదు ఆవరణలో తెల్లాపూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ లలిత సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ఈనెల 13వ తేదీన పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గస్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తెల్లాపూర్ పరిధిలోని మే ఫెయిర్  వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమాల్లో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, ఆదర్శ్ రెడ్డి, దేవేందర్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, మైనార్టీ మత పెద్దలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa