హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రతిష్టాత్మక మహిళల హాకీ ప్రపంచ కప్ 2026 క్వాలిఫైయర్స్ (FIH Hockey World Cup 2026 Qualifiers) టోర్నమెంట్‌ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. భారత్‌కు ఉరుగ్వే జట్టుకు మధ్య మ్యాచ్‌ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు.వచ్చే ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న ప్రపంచ హాకీ కప్ కోసం క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల టోర్నమెంట్‌లో 8 దేశాలు పాల్గొంటున్నాయి. గ్రూప్–ఏలో ఆస్ట్రియా, ఇంగ్లండ్, ఇటలీ, కొరియా దేశాలు, గ్రూప్–బీలో ఇండియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి.ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు గౌరవ మంత్రులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, గౌరవ ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, గౌరవ తెలంగాణ ప్రభుత్వ క్రీడా సలహాదారు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, గౌరవ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ శివసేనా రెడ్డి గార్ల తో కలిసి పాల్గొన్న గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa