ట్రెండింగ్
Epaper    English    தமிழ்

90 మంది మహిళలకు కుట్టు శిక్షణ ధృవపత్రాలు, టైలరింగ్ యూనిట్ల పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2026, 03:27 PM

న్యాల్కల్ మండలంలోని రేజింతల్ గ్రామంలో మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం ఆధ్వర్యంలో మూడు నెలల పాటు 90 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు ధృవపత్రాలు అందజేశారు. అర్హులైన వారికి టైలరింగ్ యూనిట్లను పంపిణీ చేశారు. ఈ శిక్షణతో మహిళలు ఇంటి నుంచే ఉపాధి పొందవచ్చని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎడి ప్లాంట్ హెడ్ అనిల్ కుమార్, సిఎస్ఆర్ హెడ్ శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ అరుణ రెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa