భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్‌నగర్‌లోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంగళవారం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వామివారిని దర్శించుకుని, ఆలయ అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అన్నదాన కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa