కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద అనర్హులకు నిధులు అందాయని అధికారులు గుర్తించారు. ఈ పథకం నిబంధనలను అతిక్రమించి, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు, భూమిని విక్రయించినవారు వంటి 32 వేల మంది రైతులు తెలంగాణలో కేంద్రం నుంచి సాయం పొందినట్లు గుర్తించారు. వీరి ఖాతాల్లోకి వెళ్లిన నిధులను కట్ చేయాలని కేంద్రం భావిస్తోంది. 2018-19లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 21 విడతల్లో రూ.14,237.05 కోట్లను అర్హులైన రైతులకు జమ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa