పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరా తగ్గడంతో భారత్‌లోని మెట్రో నగరాల్లో గ్యాస్ వినియోగంపై తీవ్ర ప్రభావం పడింది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో హోటళ్లు మూతపడుతున్నాయి. చెన్నై, బెంగళూరు, ముంబైలలో హోటళ్లు సమ్మెకు దిగాయి. తాజాగా, తెలంగాణలోనూ ఈ సంక్షోభం తాకింది. హైదరాబాద్‌లో 6 వేల హోటళ్లు ప్రభావితమయ్యాయి. రంజాన్ మాసంలో గ్యాస్ సరఫరా లేకుంటే నిర్వహణ కష్టమని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు తరహాలో సమ్మెకు వెళ్లాలా లేక చర్చలు జరపాలా అనేదానిపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సమాలోచనలు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa