ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శ్రీ శివ ప్రతాప్ శుక్లా పదవీ స్వీకార ప్రమాణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 02:59 PM

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారితో ప్రమాణం చేయించారు. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి గారితో పాటు శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa