బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. పార్టీ ఫిరాయింపు అంశంలో స్పీకర్ తనకు క్లీన్ చిట్ ఇవ్వడంపై స్పందిస్తూ, తాను ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. "ముఖ్యమంత్రి పదవి పోయిందని కేసీఆర్ కంటే కేటీఆరే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. పదవి తమ ఆస్తి అని కొందరు భ్రమపడుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత ప్రయత్నించినా సీఎంను డీమోరలైజ్ చేయడం వారి వల్ల కాదు" అని దానం ఎద్దేవా చేశారు. అసలు నిన్న జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి తనను ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. తాను కేవలం పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశానని, ఎక్కడా అధికారికంగా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని దానం వెల్లడించారు. శాసనసభలో పార్టీ విప్‌ను ఎప్పుడూ ఉల్లంఘించలేదని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని గుర్తు చేశారు. ఒకవేళ స్పీకర్ తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా, యుద్ధ రంగం నుండి వచ్చిన వాడిలా ఉప ఎన్నికల్లో గెలిచి చూపేవాడినని ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa