చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలంలోని పిల్లిగుండ్ల గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం టంగుటూరు గ్రామంలో 99 రోజులు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa