ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన కాలనీల అభివృద్ధికి పెద్దపీట : గూడెం మహిపాల్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2026, 02:30 PM

పటాన్చెరు :పటాన్చెరు డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని నందన్ పారడైజ్ కాలనీలో ఇంటింటికి స్వచ్ఛ జలాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఇందుకు అనుగుణంగా నూతన రిజర్వాయర్లు, సంపులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలు సైతం పొదుపుగా మంచినీటిని వాడుకోవాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa