మంగళవారం కూకట్ పల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూకట్పల్లి రామాలయంలో రాబోయే శ్రీరామనవమికి సంబంధించి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ ,ఎలక్ట్రికల్ శాంతిభద్రతలు అధికారులు పరస్పరం కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని రాబోయే భక్తులకు మంచినీరు సౌకర్యం మరియు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని అలాగే శాంతిభద్రతల విషయంలో అనుక్షణం కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.. భక్తులు కూడా అధికారులకు సహకరిస్తూ వారు సూచించిన మార్గంలో వెళ్లాలని కోరారు.దీనికి అనుగుణంగానే ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు నిర్మించాలని అన్నదానం దగ్గర ఎటువంటి ఇబ్బంది జరగకుండా స్టాల్స్ ఎక్కువ ఏర్పాట్లు చేయాలని సమీక్షలో ఆలయ అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ,వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్ ,శాంతిభద్రతలు,ట్రాఫిక్, మొదలగు అన్ని విభాగాల అధికారులు, మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ ,మాధవరం రోజా దేవి రంగారావు ,మాజీ చైర్మన్ తులసిరావు, సూర్యారావు, ఆనందరావు అశోక్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa