ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగద్గిరిగుట్టలో బస్ డిపోను ఏర్పాటుచేయాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2026, 11:27 AM

బడ్జెట్ సమావేశాల్లో 2026-27 ల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా అభివృద్ధిపై నగరానికి చెందిన ఎమ్మెల్యేలతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... జగద్గిరిగుట్ట లో అధునాతన బస్ టెర్మినల్ ను నిర్మించాలి. జగద్గిరిగుట్ట ప్రాంతం నుంచి నగరంతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలోని వివిధ ప్రాంతాలకు నిత్యం వేలాదిమంది ప్రయాణికులు బస్సు ప్రయాణం చేస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే బస్సులు రాత్రి వేళలో హాల్ట్ అవడంవల్ల సరైన సదుపాయాలు లేక రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి.  అంతేకాక ప్రయాణికులు వేచి ఉండేందుకు ఎటువంటి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి  జగద్గిరిగుట్ట పైప్ లైన్ రోడ్డులోని సర్వే నెంబర్. 223,224, 237 & 238 లోగల ప్రభుత్వ భూమి బస్ డిపోకు అనుగుణంగా ఉండడంవల్ల ఈ ప్రభుత్వ భూమిని డిపోకు కేటాయించి అభివృద్ధి పరచాలి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాలకు సరైన ప్రజా రవాణా సదుపాయం లేక  ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కావున నియోజకవర్గంలోని వివిధ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల నుంచి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజా రవాణా లో భాగంగా... బాచుపల్లి, నిజాంపేట్ నుంచి సికింద్రాబాద్ ( వయా ప్రగతి నగర్, జేఎన్టీయూ, గండిమైసమ్మ), మెహిదీపట్నం (వయా జేఎన్టీయూ), మియాపూర్ టు కూకట్ పల్లి (వయా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, సాయి నగర్ బాచుపల్లి)మియాపూర్ - సికింద్రాబాద్ (వయా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, సాయి నగర్ బాచుపల్లి) మియాపూర్ టు గండిమైసమ్మ (వయా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, సాయి నగర్ బాచుపల్లి)బాలయ్య నగర్ నుంచి బాలానగర్,  కెపిహెచ్బి నుంచి బాలయ్య నగర్ కు బస్సు సదుపాయం ఏర్పాటు చేయాలి. లాల్ సాహెబ్ గూడ నుంచి సికింద్రాబాద్ కు అదనపు బస్సు సర్వీసు. నూతన బస్సు సర్వీసు - 224/g, మియాపూర్ నుంచి మేడ్చల్ వయా ప్రణీత్ ప్రణవ్ ఫ్లోరా అపార్ట్మెంట్స్, బహదూర్ పల్లి. పునః ప్రారంభం - 229L - నాగులూరు నుంచి మేడ్చల్.బస్సు రూట్ పరిధి పెంపులో భాగంగా బస్ నెంబర్ 195, 195P, 195 M&G ( ప్రగతి నగర్ కమాన్ నుంచి మల్లంపేట్ వయా బొడ్డు రాయి, శంబీపూర్),బస్ నెంబర్ 229 - సికింద్రాబాద్ - బహదూర్ పల్లి బస్సును బౌరంపేట్ క్రాస్ రోడ్ వరకు పొడిగించాలి.అనంతరం బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారి వినతిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు త్వరలోనే జగద్గిరిగుట్టలో  అధునాతన బస్ టర్మినల్ తో పాటు బస్ డిపో ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి బస్ డిపో ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారితో పాటుగా నగరానికి చెందిన ఎమ్మెల్యేలు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa