ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2026, 11:41 AM

పటాన్చెరు : పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరో మారు తన దైవభక్తిని చాటుకున్నారు. నియోజకవర్గంలో పరమత సహనాన్ని పెంపొందిస్తూ సొంత నిధులతో దేవాలయాలు, మసీదులు. చర్చిల నిర్మాణానికి సొంత నిధులు  కేటాయిస్తూ  ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మాణానికి 15 లక్షల రూపాయల సొంత నిధులు అందించి తన భక్తి భావాన్ని చాటుకున్నారు..బుధవారం నిర్వహించిన స్వామివార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లన్న స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథరెడ్డి, కృష్ణ యాదవ్, ప్రభాకర్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa