ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై రూమర్స్.. కఠిన చర్యలకు సిద్ధమైన కేంద్రం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2026, 03:03 PM

దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజీ కొరతపై వస్తున్న వదంతులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఐటీ నిబంధనల్లో మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అభ్యంతరకర కంటెంట్ తొలగించేందుకు ఉన్న 3 గంటల గడువును 1 గంటకు తగ్గించాలని యోచిస్తోంది. ఇంధన ధరలు, సరఫరా అంశాలపై పుకార్లు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది. సోషల్ మీడియా సంస్థలతో చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa