శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు యాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో నాంపల్లి, అఘాపురా, మంగళ్‌హాట్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, కోఠి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే ఎంచుకుని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa