కట్టంగూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానంలో గురువారం వసంత నవరాత్రుల శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా శ్రీరామ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు షోడ శోపదారపూజ, విద్యార్థులచే హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీరామడుగు శ్రీనివాస్ శర్మ, శశిరేఖ, కోమటి భాస్కర్ పారిజాత దంపతులు, స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa