కామారెడ్డి జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు శ్రీ కోడూరి హనుమాన్ దేవాలయం నుండి హనుమాన్ విజయ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పాల్గొనాలని మంగళవారం వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు నిత్యానందం, సామ గంగారెడ్డి, వివేకానంద, అశోక్ కుమార్, బొల్లి రాజు, రమేష్ చింతల, రమేష్ తదితరులు కోరారు. ఈ సందర్భంగా, కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, ఎమ్మెల్యే రమణారెడ్డిలకు ఆహ్వానాలు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa