TG: రాష్ట్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ, శాఖల మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో మెజార్టీ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. తమ పదవికి ముప్పు ఉంటుందేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే కేబినెట్ ప్రక్షాళనలో ముగ్గురు మంత్రులపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటితో పాటుగా ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను సైతం భర్తీ చేసి, కేబినెట్‌లోకి కొత్తగా ఐదుగురిని తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయే వారిలో అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa