ప్రియుడి ఆత్మహత్య తట్టుకోలేక భవనంపై నుండి దూకి ప్రియురాలి ఆత్మహత్య. 13 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి రెండేళ్ల క్రితం బెంగుళూరులో స్థిరపడ్డ సిద్దిపేట జిల్లా ములుగు మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన రఘుపతిరెడ్డి, జయమ్మ దంపతుల పెద్ద కుమారుడు భానుచందర్ రెడ్డి(32) అనే యువకుడు. గత కొంత కాలంగా తనతో పాటు చదువుకున్న మేడ్చల్ జిల్లాకు చెందిన బీబీ షాజియా సిరాజ్(31) అనే యువతిని ప్రేమించి, ఆమెతో సహజీవనం చేస్తున్న భానుచందర్ రెడ్డి. ఇటీవల స్వగ్రామానికి వెళ్లి బెంగుళూరు తిరిగి వచ్చే సరికి భానుచందర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చూసి తట్టుకోలేక, వారు నివసిస్తున్న ధణసింద్ర మెయిన్ రోడ్డులోని నికో హోమ్స్ అపార్ట్మెంట్ భవనం 17వ అంతస్తు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి. గత కొంతకాలంగా భానుచందర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులకు తెలిపిన స్థానికులు. తమ కొడుకు ఇండియా వచ్చాడనే విషయమే తమకు తెలియదని భానుచందర్ తల్లిదండ్రులు చెప్పగా, షాజియా వివరాలు తెలిపేందుకు నిరాకరించిన ఆమె కుటుంబ సభ్యులు . ఎలాంటి సూసైడ్ నోట్ దొరకకపోవడంతో అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa