ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబరాబాద్‌లో రేపు మద్యం దుకాణాలు బంద్: కమిషనర్ ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 01, 2026, 04:36 PM

హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం రేపు (ఏప్రిల్ 2) సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్ బార్లను మూసి ఉంచాలని ఆదేశించారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపు ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa