ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శేరిలింగంపల్లిలో ఆలయాల్లో ఘనంగా మండల పూజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 01, 2026, 04:34 PM

శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలోని షిర్డీ సాయినాథ, మార్కండేయ స్వామి, సంతాన నాగదేవత ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన జరిగి 41 రోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం మండల పూజ, హోమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాగం సుజాత యాదవ్ నిర్మించిన ఈ ఆలయంలో జరిగిన వేడుకలకు యువజన నాయకుడు రాగం అనిరుధ్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతూ నిర్వహించిన ఈ క్రతువుల్లో స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa