తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేనేత కార్మికులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈరోజు రూ. 33 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదల ద్వారా చేనేత జౌళి శాఖ రాష్ట్రంలోని వేలాది మంది చేనేత కార్మికులకు ఉన్న అప్పులను తీర్చడానికి మార్గం సుగమమైంది.తాజాగా విడుదలైన ఈ పూర్తి నిధులను.. చేనేత కార్మికులపై ఉన్న రుణాలను పూర్తిగా మాఫీ చేయడానికి వినియోగించనున్నారు. ఈ నిధులపై హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్, అప్పారెల్ ఎక్స్‌పోర్ట్ పార్క్స్ కమిషనర్‌కు పూర్తి అధికారాలు కల్పించారు. లబ్ధిదారుల రుణమాఫీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసే విధంగా ఏర్పాట్లు చేశారు. చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వం చూపిన ఈ చిత్తశుద్ధికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa