ఐటీ రంగం కేవలం పశ్చిమ హైదరాబాద్‌కే పరిమితమై ఉండేది. అయితే, నగరం నలువైపులా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కండ్లకోయలో భారీ ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. సుమారు 6 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో నిర్మిస్తున్న ఈ పార్క్.. విస్తీర్ణంలో ప్రఖ్యాత సైబర్ టవర్స్ కంటే పెద్దదిగా ఉండబోతోంది. భవిష్యత్తులో ఇక్కడ దాదాపు 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ ప్రాజెక్టు ప్రకటనతోనే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పుంజుకుంది.ఉత్తర హైదరాబాద్ అభివృద్ధికి రవాణా సౌకర్యాలు వెన్నెముకగా నిలుస్తున్నాయి: రహదారులు: హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారి (NH-44) ఈ ప్రాంతం గుండా వెళుతుంది. రద్దీని తగ్గించేందుకు సుచిత్ర నుండి కొంపల్లి వరకు సుమారు 10 కి.మీ మేర మూడు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. రైల్వే & ఎంఎంటీఎస్: ముంబై, షిర్డీ వెళ్లే ప్రధాన రైలు మార్గంతో పాటు బొల్లారం, మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ (MMTS) సదుపాయం ఉండటం ఉద్యోగులకు వరం. ప్రాముఖ్యత: ఇక్కడ జీనోమ్ వ్యాలీ, నల్సార్ వంటి అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు ఇప్పటికే కొలువుదీరాయి. ఇతర హైవేలతో పోలిస్తే ఇక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండటం వల్ల 30 నిమిషాల్లోనే నగరం నడిబొడ్డుకు చేరుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa