పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యవిద్య కళాశాలల్లోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్-2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ కోరింది. బుధవారం ఉ.8 గంటల నుంచి ఈనెల 30వ తేదీ సా.5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.