మేషం
వ్యాపారాలలో అనుకొన్న సమయానికి నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరిస్తారు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
వృషభం
దూరప్రాంత సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుతాయి. బంధుమిత్రులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిధునం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారమున భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కర్కాటకం
జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.
సింహం
సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. దూరపు బంధువులతో గృహమున సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.
కన్య
ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
తుల
వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రారంభించి పనులలో అవరోధాలు కలుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు తప్పవు. వ్యాపారాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.
వృశ్చికం
వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
ధనస్సు
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
మకరం
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. గృహమున కొందరి మాటలు చికాకు కలిగిస్తాయి.
కుంభం
వ్యాపారమున స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ యత్నాలు అనుకూల ఫలితాన్నిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక ప్రగతి సాధిస్తారు.ధన పరంగా సమస్యలను అధిగమిస్తారు.
మీనం
అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్ధికంగా కొంత నిరాశ తప్పదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు విఫలమవుతాయి. సన్నిహితులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి.