సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగిన పవిత్రోత్సవాలు శుక్రవారం నాటితో ముగిసాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెల్లవారుజామున సింహాద్రినాధుడు, శ్రీదేవి భూదేవి అమ్మవార్లుకు ప్రత్యేక పూజాది కార్యక్రమంలు నిర్వహించారు. అనంతరం ఏకాంత స్వప్న తిరుమంజనం గావించారు. పవిత్రోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు విశేష హోమాలు పారాయణ లు జరిపారు, వేదమంత్రోచ్ఛారణల, మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ పవిత్రాలను స్వామి , అమ్మవార్లకు సమర్పించారు.
అన్ని అనుబంధ ఆలయాలు, దేవతామూర్తులకు కూడా పవిత్రాలను సమర్పించి ఏడాది పొడవునా జరిగిన పూజాది కార్యక్రమాలు, కైంకర్యాలలో తమకు తెలిసి, తెలియక తప్పులు ఏమైనాచేసి ఉంటే క్షమించాలని అంతా కోరుకున్నారు. చివరి రోజు మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. శుక్రవారం నాటితో ఈ పవిత్రోత్సవాలు ముగిసాయి. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, పురోహితులు కరి సీతారామాచార్యులు. ఇన్చార్జి ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, వెంకట రమణాచార్యులు, , ప్రసాద్ ఆచార్యులు ఏఈవో ఆనంద్ కుమార్ , ట్రస్టు బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్ రాజు, సతీష్, ఎం రాజేశ్వరి , డి. రామ లక్ష్మి, ఎస్. శ్రీదేవి, శ్రీదేవి వర్మ వంకాయలు నిర్మల, బయ్య వరపు రాద, ప్రత్యేక ఆహ్వానితులు చందు యాదవ్ తదితర పాలకమండలి సభ్యులు అంతా పాల్గొన్నారు.