గన్నవరం నియోజకవర్గం వీరవల్లి జాతీయ రహదారి వెంబడి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ గడిలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు మొదటి రోజు అర్ఛకుడు కుందుర్తి మురళీ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడమ ఉదయం నుంచి కలశస్ధాపన, గణపతి పూజా, సహస్రనామ కుంకుమార్చన లు వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మోర్ల ఆంజనేయులు దంపతులు వెండి కలశం, భాస్కరచారి దంపతులు వెండి పాదాలు అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అర్ఛకుడు కుందుర్తి మురళీ, గుడి కమిటీ సభ్యులు వంగపండు సూర్యప్రకాశరావు, లింగమనేని శ్రీనివాసరావు(చిన్ని), అర్నేపల్లి కిషోర్, లింగమనేని రాజారావు, లింగమనేని రత్నారావుతో పాటు రాయి శివపార్వతి, రాయి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.