పాత మంగళగిరి హుస్సేన్ కట్ట వద్ద వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మంగళవారం శ్రీ కాశీ అన్నపూర్ణదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలంకార కైంకార్యపరులుగా శిరందాసు విజయభాస్కర్, ఆదిలక్ష్మి వ్యవహరించారు.
అనంతరం ఆలయ నిర్వాహకురాలు వాకా ప్రభావతి మాట్లాడుతూ ఆలయంలో నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు లక్కీ డీప్ కూపన్ లు పంపిణీ చేస్తున్నామని, విజయదశమి రోజున మధ్యాహ్నం డ్రా తీసి ప్రధమ, ద్వితీయ బహుమతులుగా కాంచీపురం పట్టుచీర, ఫ్యాన్సీ పట్టుచీరలను భక్తులకు బహుమతులుగా అందజేయడం జరుగుతుందన్నారు.