నెల్లూరు జిల్లా, పట్టభద్రుల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థికి వచ్చే మెజార్టీ చూసి ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా తీర్పును తీసుకువద్దామని బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ప్రకటించారు. ఓటరు లిస్టులో పేర్లు నమోదు అనేది అత్యంత ప్రతిష్టాత్మంగా జరగాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి ఓటు నమోదు చేయించడంతో పాటు, ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. పట్టభద్రుల ఓట్లు చాలా కీలకమన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వాళ్లు గమనిస్తున్నారని, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రత్యేక ఆదరాభిమానాలు వాళ్లకు ఉన్నాయన్నారు. ప్రతి ఓటు ఎంతో కీలకంగా భావించి మెజార్టీ వచ్చే విధంగా చూడాలన్నారు. చాలా కాలం తర్వాత జిల్లాలో తిరిగి పట్టభద్రుల ఎన్నికల వాతావరణం వస్తోందని, ఈ విషయంపై ప్రతి ఒక్కరం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గెలవడం ఖాయమని, మెజార్టీని చూసి ప్రతిపక్షాలు భయపడే విధంగా తీసుకుని వద్దామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, పి రూప్‌కుమార్, నిరంజన్‌బాబురెడ్డి, వీరి చలపతి తదితరులు పాల్గొన్నారు.