ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్లో 22, 820 సీట్లు భర్తీచేయనున్నారు. ఇందులో 16, 776 సీట్లు కంప్యూటర్ సైన్స్, ఐటీ తత్సంబంధ బ్రాంచీల్లోనే ఉన్నాయి. ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ నుంచి ప్రారంభమైంది. తొలిరోజు 3, 374 విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రే షన్ చేసుకొన్నారు. బుధవారం వరకు రిజిస్ట్రేషన్, 13 నాటికి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 16న సీట్లను కేటాయించనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచిలో 4, 424, సివిల్, మెకానికల్ తత్సంబంధ బ్రాంచుల్లో 1, 891, ఇతర బ్రాంచీల్లో 289 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. అధిక డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజి నీరింగ్ బ్రాంచిలో 6, 510 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్లెర్నింగ్లో 3, 419, డాటాసైన్స్ 2, 418 సీట్లు ఉన్నాయి.