మేషం
సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.
వృషభం
కీలక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు.
మిధునం
ఆర్థిక పరంగా పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగండం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
కర్కాటకం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు పని చేయదు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు.
సింహం
కొన్ని వ్యవహారాలలో అవరోధాలు కలిగిన ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.సంఘంలో పలుకుబడి పెరుగుతుంది.
కన్య
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దీర్ఘకాలిక ఋణ భారం తొలగుతుంది ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సంతాన విద్యాయత్నాలు సానుకూలమవుతాయి.
తుల
కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు.బంధు, మిత్రులతో తగాదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృశ్చికం
వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి.
ధనస్సు
దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి.
మకరం
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు అదిగమిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు అందుతాయి.
కుంభం
వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. బంధు వర్గంతో విభేదాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.
మీనం
వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు అనుకోని ఖర్చులు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.