మేషం
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలలొ వాహన ఇబ్బందులుంటాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి.
వృషభం
ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన శిరోభాధలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విబేదిస్తారు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మిధునం
జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగస్తులు పనిఒత్తిడి నుండి బయటపడతారు నూతన వ్యాపారాలు ప్రారభించి లాభాలు అందుకుంటారు.
కర్కాటకం
ఉద్యోగమున అధికారులతో ఆలోచించి మాట్లాడాలి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఒక కీలక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక నష్టాలు ఎదుర్కొంటారు.
సింహం
సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.
కన్య
దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
తుల
వ్యాపారమున నూతన లాభాలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. చాలా కాలంగా పూర్తి కానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృశ్చికం
విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూలత కలుగుతుంది. బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వాహన యోగం ఉన్నది. ధన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.
ధనస్సు
చేపట్టిన పనులు ముందుకు సాగవు. జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు మానసికంగా భాదిస్తాయి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఆలోచించి మాట్లాడాలి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.
మకరం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో కష్టం వృధాగా మిగులుతుంది.
కుంభం
భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
మీనం
కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది.